ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరిప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి ఏమిటి?

Tue, Dec 07, 2010
             సినిమా పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్  వెంటే పరిగెడుతుంది. అది లేకపోతే ఎంతటివారినైనా వదిలేస్తుంది. అందుకే, వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న వాడే ఇక్కడ రాణిస్తాడు. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాణ్ణి ఇక్కడెవరూ క్షమించరు. పాపం...  దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. 'బొమ్మరిల్లు' తర్వాత అల్లు అర్జున్ తో భాస్కర్ చేసిన రెండో  సినిమా 'పరుగు' బాక్సాఫీసు నుంచి పరుగు లంకించుకుని ఫ్లాపయింది. ఇప్పుడు రామ్ చరణ్ తో తీసిన 'ఆరెంజ్' కూడా విజయాన్ని చేరుకోలేక పోయింది. మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ఆ సినిమా రిజల్ట్ వాళ్ళనే కాకుండా మెగా ఫ్యామిలీని కూడా తీవ్ర నిరాశకు గురిచేసినట్టు చెబుతున్నారు.  చరణ్ సంపాదించుకున్న ఇమేజ్ తో భాస్కర్ ఒక విధంగా ఆటాడుకున్నాడని అంటున్నారు.

              దీనికి తోడు, షూటింగుకు సంబంధించి సరైన ప్లానింగ్ లేకపోవడంతో సినిమా బడ్జెట్ ను కూడా చేతులారా పెంచేసాడని విమర్శలొచ్చాయి.  ఈ నేపధ్యంలో దీని ప్రభావం దర్శకుడు భాస్కర్ కెరీర్  పై పడే సూచనలు కనపడుతున్నాయి. 'ఆరెంజ్' చిత్రం నిర్మాణంలో వుండగా,  'ఆవారా' ఫేం కార్తి హీరోగా భాస్కర్ దర్శకత్వంలో  'ఛత్రపతి' ప్రసాద్ ఓ సినిమాను తీస్తున్నట్టు ప్రకటించాడు. మరి ఇప్పుడు ఆ సినిమా వుంటుందో లేదో చెప్పలేం. ఏదైనా, మళ్ళీ దిల్ రాజే భాస్కర్ కి ఏదైనా హిట్ ఇచ్చి ఆదుకోవాలని టాలీవుడ్ లో కొంత మంది సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు!          
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)