ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అగ్ర కథానాయకుల కలయిక

Thu, Feb 16, 2012
కమల్-రజని
కమల్-రజని
        తమిళ అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ కలిసి నటిస్తారంటూ గత
కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమయ్యే రోజు
త్వరలో రానుందని తెలుస్తోంది. ఎందుకంటే, వీరిద్దరూ కలిసి నటించే సినిమాకు
సంబంధించిన ప్రయత్నాలు చురుకుగా జరుగుతున్నాయి. రజనీ, కమల్ ఇటీవల
కలిసినప్పుడు ఈ సినిమా గురించిన చర్చ జరిగిందట. కమల్ 'మరుదనాయగం' అనే కథను
కొన్నాళ్ల క్రితం తయారుచేసిపెట్టుకున్నారు. ఎప్పటికైనా దానికి తెరరూపం
ఇవ్వాలన్నది ఆయన కోరిక. అయితే, బడ్జెట్ విషయంలోనే ఆయన తటపటాయిస్తూ ఆ
ప్రాజక్టుని ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చారు.

      ఇందులో రజనీకాంత్ చేయదగ్గ క్యారెక్టర్ ఒకటి వుందట. అది ఆయన చేత
వేయిస్తే సినిమాకు నిండుదనం చేకూరుతుందన్నది కమల్ అభిప్రాయం. రజనీ కూడా ఈ
సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట. ఈ సినిమా గురించి కమల్ తాజాగా
చెబుతూ, తామిద్దరం కల్సి కెరీర్ తొలినాళ్ళలో పది సినిమాల వరకు చేశామనీ, ఆ
తర్వాత సరైన స్క్రిప్ట్ దొరకక మళ్లీ చేయలేదనీ, ఇప్పుడు సమయం ఆసన్నమైందనీ
అంటున్నాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ 'మరుదనాయగం' సినిమా ఇక తెరకెక్కడం
ఖాయమని పరిశీలకులు అంటున్నారు. నిజంగా ఇది వాస్తవరూపం దాలిస్తే అభిమానులకి
పండగే కదా?
X

Feedback Form

Your IP address: 54.211.213.149
Movie News (Latest)