ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డైరెక్టర్ అవతారమెత్తుతున్న కథానాయిక!

Tue, Feb 14, 2012
        బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనా కపూర్ త్వరలో దర్శకురాలిగా
మారనుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. త్వరలో ఆమె ఓ చిత్రానికి
దర్శకత్వం వహించడానికి రెడీ అవుతోందనీ, కరణ్ జోహార్ సొంత చిత్ర నిర్మాణ
సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తుందనీ
వార్తలు వినిపిస్తున్నాయి. కరీనాకు మొదటి నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం
అనే చెప్పాలి. తను కథానాయికగా నటించే చిత్రాల షూటింగులో ఆయా దర్శకుల శైలిని
పరిశీలిస్తూ వుంటుంది. అలాగే డైరెక్షన్ కు సంబంధించి తన సందేహాలను
నివృత్తి చేసుకుంటూ వుంటుంది. ఈ విషయంలో దర్శకుడు కరణ్ జోహార్ ఆమెను మొదటి
నుంచీ ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడు. తన స్నేహితురాలి దర్శకత్వ ప్రతిభను
కరణ్ చాలాసార్లు ప్రశంసించాడు కూడా. ఇప్పుడు ఏకంగా ఆమెకు డైరెక్టర్ గా
అవకాశం కూడా ఇస్తున్నాడు!
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)