ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ పక్కన దీపికా పదుకొనే

Tue, Feb 07, 2012
      
తమిళనాడుని పాలించిన 8 వ శతాబ్దపు రాజు కొచ్చాడియాన్ రణధీరణ్ గా రజనీకాంత్ తన అభిమాన
ప్రేక్షకులని అలరించనున్నారు. ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోన్న ఈ 3D
సినిమాని రజనీకాంత్ కూతురు సౌందర్య తెరకెక్కిస్తున్నారు. జనవరి 19 న
ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15 నుంచి రెగ్యులర్ గా జరగనుంది.
'అవతార్'  చిత్రం కోసం జేమ్స్ కేమరూన్ ఉపయోగించిన 3D మోషన్ పిక్చర్
క్యాప్చరింగ్ టెక్నాలజీని ఈ సినిమాకి వాడుతోండటం విశేషం. కె.ఎస్. రవికుమార్
దర్శక పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా స్నేహ
నటిస్తోంది. ఇక శోభన, నాజర్, శరత్ కుమార్ , ఆది, లక్ష్మి మంచు, జాకీష్రాఫ్ తదితరులు మిగతా
ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో
ముస్తాబవుతోన్న ఈ సినిమాకి మద్రాస్ మొజార్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు.
భారీతనంలో బాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతోన్నఈ సినిమాలో కథానాయిక ఎవరనే కన్
ఫ్యూజన్ చాలా రోజులు కొనసాగింది. చివరికి బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనే తాజాగా ఎంపికైంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)