ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు.... టూకీగా

Tue, Feb 07, 2012
*  కథానాయిక రిచా గంగోపాద్యాయ తమిళంలో 'ఒస్తీ', 'మయక్కం ఎన్న' అనే రెండు
చిత్రాలు చేసింది. వీటి తర్వాత కోలీవుడ్ లో పలు అవకాశాలు వస్తున్నాయనీ,
అయితే, తొందరపడి ఒప్పుకోవడం లేదనీ రిచా అంటోంది. మంచి పాత్ర కోసం
ఎదురుచూస్తున్నానని చెప్పింది.

*  పన్నీర్ సెల్వం దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో
'రేణిగుంట' పేరుతో డబ్ చేస్తున్నారు. సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ
చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. రాష్ట్ర మంత్రి
ఘంటా శ్రీనివాసరావు, వీవీ వినాయక్ కలిసి ఆడియోను రిలీజ్ చేయగా, డి.
రామానాయుడు తొలి సీడీని స్వీకరించారు.

*  రానా, జెనీలియా జంటగా ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'నా
ఇష్టం' సినిమా షూటింగుకు సంబంధించి ఇక ఒక పాట మాత్రం మిగిలివుంది. దీనిని
త్వరలో షూట్ చేసి, వచ్చే నెల ద్వితీయార్ధంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని
నిర్మాత చెప్పారు.

*  రాం చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ'
సినిమా ఆడియో ఫంక్షన్ అభిమానుల సమక్షంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
కర్నూలు పట్టణంలో ఈ వేడుక జరగచ్చని తెలుస్తోంది.

*  గతంలో బీజేపి అధ్యక్షుడిగా వ్యవహరించిన బంగారు లక్ష్మణ్ రక్షణ శాఖ
ఆయుధాల డీల్ లో లంచం తీసుకున్నారంటూ తెహల్కా పత్రిక తమ స్టింగ్ ఆపరేషన్ తో
ఆరోపించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా మారిన జర్నలిస్టు కుమార్ బాదల్ ఈ
ఉదంతం నేపథ్యంలో ఓ సినిమా రూపొందిస్తున్నారట.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)