ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు... టూకీగా

Mon, Feb 06, 2012
*  అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న కథానాయిక శ్రియకు మరో ఫ్లాప్
ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన 'గలీ గలీ చోర్ హై' చిత్రం శుక్రవారం విడుదలై
ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఇక ఆమెకు అవకాశాలు
కష్టమే!

*  వెన్నెల కిషోర్ దర్శకత్వంలో చైతన్య కృష్ణ, మోనాల్ గజ్జార్ జంటగా
రూపొందుతున్న 'వెన్నెల 1 1/2' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి
హైదరాబాదులో జరిగింది. వీవీ వినాయక్ వీటిని ఆవిష్కరించగా, తొలి సీడీని మంచు
మనోజ్, నారా రోహిత్ స్వీకరించారు.

*  ముగ్గురు నిర్మాతలు కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్రనిర్మాతలు
అల్లు అరవింద్, దిల్ రాజు లకు '100 % లవ్' సినిమా నిర్మించిన బన్నీ వాసు
తోడై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందే ఈ
చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటించే అవకాశం వుంది.

*  'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ నుంచి మాయమైపోయిన దర్శకుడు
బొమ్మరిల్లు భాస్కర్, తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో
హీరో రామ్ కథానాయకుడుగా నటిస్తాడట.

*  'రంగం' ఫేం జీవా తమిళంలో నటించిన 'సింగం పులి' చిత్రాన్ని 'సింహం పులి'
పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ
చిత్రాన్ని ఈ నెల మూడో వారంలో రిలీజ్ చేస్తారు. సాయిరమణి దర్శకత్వంలో
రూపొందిన ఈ చిత్రంలో రమ్య, హనీరాజ్ హీరోయిన్లుగా నటించారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)