ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతారకు లక్ష్మణ రేఖ!

Fri, Feb 03, 2012
        కొన్ని రకాల పాత్రలు ఆయా తారలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. వాళ్ళకొక కొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టి హుందాతనాన్ని ఇస్తాయి. కథానాయిక నయనతార విషయంలో కూడా ఇదే జరిగింది. 'శ్రీరామ రాజ్యం' సినిమాలో ఆమె పోషించిన సీత పాత్ర ఆమె వ్యక్తిగత జీవితానికి ఒక లక్ష్మణ రేఖను గీసింది. మహాసాధ్వి సీత పాత్రలో ఆమె రూపం, అభినయం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

       అందుకే కొన్నాళ్ల వరకు ఆమెలో సీతాదేవినే చూస్తుంటారు. అది దృష్టిలో పెట్టుకునే నయనతార ఇప్పుడు ఏ ఫంక్షన్ కి వచ్చినా నిండుగా చీరకట్టుకుని, తనను చూడగానే ఓ పవిత్రమైన భావన కలిగేలా నయన్ వ్యవహరిస్తోంది. గతంలో ఎప్పుడూ మోడరన్ దుస్తుల్లో ట్రెండీగా, సెక్సీగా దర్శనమిచ్చిన ఆమెకిది కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ... పాపం తప్పడం లేదట! త్వరలో నాగార్జునతో చేయబోయే సినిమాలో కూడా ఇలా చీరకట్టు పాత్రనే చేయనుందని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి మాత్రం తిరిగి గ్లామర్ పాత్రలపై దృష్టి పెట్టాలని నయన్ నిర్ణయించుకుందట.  
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)