ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభాస్-రానా మల్టీ స్టారర్?

Thu, Feb 02, 2012
     ఈ మధ్య కాలంలో యువ కథానాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులని ఆనందాశ్చర్యాలకి గురిచేస్తున్నాయి. యంగ్ హీరోలు ఇలా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకోవడం... మల్టీ స్టారర్ చిత్రాలను సైతం అంగీకరిస్తుండటం వాళ్లని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆల్రెడీ వెంకటేష్-మహేష్ బాబుల కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడదే కోవలో మరో మల్టీ స్టారర్ చిత్రం రూపొందనుంది . ఇటీవల తమిళంలో వచ్చిన 'వెట్టయ్' చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మాధవన్, ఆర్య, అమలాపాల్, సమీరా రెడ్డి నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని బెల్లంకొండ సురేష్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకులతో ఆయన ఈ సినిమాని నిర్మించనున్నారట! ఆ హీరోలు ఎవరన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు గానీ... ప్రస్తుతానికి ప్రభాస్-రానా ల పేర్లు మాత్రం వినిపిస్తునాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)