ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణ సూచనలు... మహేష్ అడుగుజాడలు!

Wed, Feb 01, 2012
    ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ మూల చూసినా SMS అనే పేరే కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్న కొత్త కుర్రాడు సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు. సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకుడిగా వ్యవహరించారు. ఇక సుధీర్ బాబు సరసన రెజీనా కథానాయికగా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న విడుదలకి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మీడియాతో తన తొలి సినిమా అనుభవాలు-అనుభూతులను ఇలా పంచుకున్నారు...

  SMS అనే పేరే వెరైటీగా ఉంది. యూత్ లోకి బాగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారా?

  అలాంటిదేం లేదు... నిజానికి SMS అంటే షార్ట్ మెస్సేజ్ సర్వీస్ అని అర్ధం. కాని మేం 'శివ మనసులో శృతి' అనే అర్ధంతో ఈ పేరు పెట్టడం జరిగింది.

  ఈ సినిమాకి స్టోరీ లైన్ మీరే తయారు చేసుకున్నానని అన్నారు. ఈ కథ పై మీకంత నమ్మకం ఉందా?

  'దూకుడు' సినిమా షూటింగ్ జరుగుతుండగా వెళ్లి ఈ కథని శ్రీను వైట్లకి చూపించాను. ఆయన చిన్న చిన్న మార్పులతో కథని ఓకే చేశారు.

 ఇంతకీ ఈ కథలో ఏయే అంశాలు ఉంటాయనుకోవచ్చు?

  యాక్షన్... లవ్... సెంటిమెంట్ ... కలగలసిన  ఎంటర్ టైనర్ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

  మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరో గా నిలదొక్కుకుంటానని అనిపించిందా?

  ఆ నమ్మకంతోనే కష్టపడ్డాను. నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రతి రోజూ డాన్సూ...ఫైట్సూ ప్రాక్టీస్ చేశాను.

  అసలు మీకు సినిమాల్లోకి రావాలని ఎప్పుడనిపించింది?

  చిన్నతనం నుంచి కూడా నటుడు కావాలనే కోరిక నాలో బలంగా ఉండేది. మామయ్యా- మహేష్ ల ప్రోత్సాహంతో అది నెరవేరింది.

  మీరు నటిస్తానని అన్నప్పుడు కృష్ణ గారు ఎలా స్పందించారు?

  సినిమా ఫీల్డ్ లో చాలా తక్కువమంది సక్సెస్ అవుతారనీ... అయితే అలా సక్సెస్ అయిన వాళ్లంతా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళేనని చెప్పి నాకు స్పూర్తినిచ్చారు.

  మరి మహేష్ ఏమన్నారు?

  రెండు సంవత్సరాల పాటు నేను కష్టపడి అల్లుకున్న సన్నివేశాలను ... కంపోజ్ చేసుకున్న ఫైట్స్ ను... డాన్స్ ను... సీడీ చేసి నమ్రతకి ఇచ్చాను. ఆమె మహేష్ కి చూపించారు. ఆ సీడీని చూసిన మహేష్ నన్ను అభినందించి ప్రోత్సహించారు.

  దర్శకుడిగా సత్య ని ఎంచుకోవడానికి కారణం?

 చాలా కాలంగా సత్య నాకు మంచి మిత్రుడు. అతనిలో ఓ అద్భుతమైన దర్శకుడు దాగున్నాడు. ఈ సినిమాని అతను చాలా చక్కగా తెరకెక్కించాడు.

  మీ సినిమా ఆడియోకి రెస్పాన్స్ ఎలా వచ్చింది?

  ఈ సినిమాకి సెల్వ గణేష్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఆడియోకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. గణేష్ కెరియర్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది.

  తొలి కాంప్లిమెంట్ ఎవరినుంచి వచ్చింది?

  మంజుల గారు ఈ సినిమా చూసి చాలా అనుభవం ఉన్న నటుడిలా చేశావంటూ ఎంతగానో అభినందించారు.

  తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా?

  రెండు కథలు పరిశీలనలో ఉన్నాయి. SMS రిలీజ్ తర్వాత ఫైనలైజ్ చేద్దామని అనుకుంటున్నాను.

X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)