ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐదు గెటప్పులలో సూర్య!

Wed, Feb 01, 2012
     సూర్య కథానాయకుడిగా మరో ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో తమిళంలో తెరకెక్కుతోన్న ఆ భారీ చిత్రం పేరే 'మాట్రాన్'. కల్పాతి ఎస్.అఘోరం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కాజల్ కనిపించనుంది. ఇటీవల రష్యా లో జరిగిన మేజర్ షెడ్యూల్ తో ఈ సినిమా 70 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుందట! ఆ తర్వాత హైదరాబాద్ లోని  రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి అందులో కొన్ని కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో సూర్య 5 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేస్తారు. ఈ సారైనా సూర్య చేస్తున్న ఈ ప్రయోగం ఫలిస్తుందో... లేకపోతే ఏకంగా వెళ్లి 'సెవెంత్ సెన్స్' సరసన చేరుతుందో...!
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)