ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ సినిమా వదులుకున్న రానా

Tue, Jan 31, 2012
    'లీడర్'... 'నేనూ నా రాక్షసి'... వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా హీరోగా మాత్రం దగ్గుపాటి రానా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం 'నా ఇష్టం'... 'డిపార్ట్ మెంట్'... చిత్రాలతో బాటు క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమా కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడా చెన్నయ్' అనే తమిళ సినిమాని కూడా అంగీకరించాడు. అయితే ఈ సినిమా నుంచి రానా అర్ధంతరంగా తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత దయానిధి అళగిరి స్వయంగా వెల్లడించారు. తమకీ, రానాకి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదనీ... పాత్ర పట్ల అసంతృప్తితోనే అతను తప్పుకున్నాడని ఆయన అన్నారు. జూన్ లో రానా డేట్స్ ప్రోబ్లం ఉండటం కూడా మరో కారణమని చెప్పారు. అయితే, ఈ సినిమాలో ప్రధాన హీరోగా నటిస్తున్న శింబు పాత్ర డామినేటింగ్ గా వుండడం వల్లే రానా తప్పుకున్నట్టు కోలీవుడ్ వర్గాల కథనం.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)