ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

2 కోట్ల భారీ సెట్లో నాగ చైతన్య

Mon, Jan 30, 2012
     'ఏ మాయ చేశావే'... '100 % లవ్'... వంటి చిత్రాల ద్వారా యువతరం మనసు దోచుకున్న నాగ చైతన్య, ఆ తర్వాత యాక్షన్ హీరో గుర్తింపు కోసం 'బెజవాడ' లో బాగానే కష్టపడ్డాడు. ఇప్పుడిక మాస్ ఆడియన్స్ మార్కులు అవసరమని భావించిన నాగచైతన్య, 'ఆటోనగర్ సూర్య'గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. విజయవాడకి సంబంధించిన యూనియన్ లేబర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    ఈ సినిమా కోసం ఇటీవల 2 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్ వేశారట! కథా పరంగా ఈ సెట్ వేయడం అవసరమనీ... ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించడం జరుగుతుందని చెపుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కథానాయికగా సమంతా అలరించనుంది. నాగ చైతన్యకి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టే ఈ సినిమా ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకి వస్తుందని అచ్చిరెడ్డి చెప్పారు. మరి నాగ చైతన్య ప్రయత్నం ఎంతవరకు సఫలీకృత మౌతుందో వేచి చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)