ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమె పెళ్లి గ్రాండ్ గానే వుంటుందట!

Mon, Jan 30, 2012
      ఈ మధ్య కరీనాకపూర్ 40 లక్షల ఖరీదు చేసే ఓ నెక్లస్ తయారుచేయమని ఓ సంస్థకి ఆర్డర్ ఇచ్చిందట! అంతే ఈ విషయం బైటికి పొక్కడం...అల్లరల్లరి కావడం జరిగిపోయింది. ఏం...ఆమె నెక్లెస్ చేయించుకోకూడదా...ఆ మాట కొస్తే ఆమె దృష్టిలో అది చాలా తక్కువ ఖరీదైనదే కదా అని చాలామంది అనుకున్నారు. అసలు విషయమేవిటంటే...ఆ నెక్లెస్ కి ఆర్డర్ ఇచ్చింది సైఫ్ అలీ అనీ, పెళ్లి సందర్భంగా అది అతను ఆమెకి ఇవ్వబోతున్న ప్రేమ కానుక అని తెలిసాక, అయితే కచ్చితంగా ఇది ప్రత్యేకమైన వార్తే అంటూ  అంతా ఆసక్తి చూపించారట!

     ఏదేవైనా ఈ తతంగానికి ఇంత సీక్రెట్ మెయిన్ టైన్ చేయడం అవసరమా అంటే...వాళ్ళు తమ పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలనుకుంటున్నారనే సమాధానాలూ బాలీవుడ్ లో వినిపిస్తున్నాయట! ఈ సంగతి తెలియడంతో కరీనా మొహం కోపంతో కందిపోయింది. సైఫ్ తో తన పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుందనీ... నిరాడంబరంగా చేసుకోవలసిన అవసరం తమకి లేదని తేల్చి చెప్పింది. ఇక గిఫ్ట్ ల విషయానికే వస్తే ...ఇంతకన్నా విలువైన గిఫ్ట్ లు  సైఫ్ తనకి చాలానే ఇచ్చాడనీ...ఇప్పుడీ నెక్లెస్ కీ, పెళ్లి కి ముడిపెట్టొద్దని అంది. ఇక ఈ విషయం గురించి ఇంతగా చర్చించుకోవాల్సిన అవసరం లేదంటూ గొప్పోళ్ళ పెళ్లికి గోలెక్కువ అనే టైపులో ఎక్స్ ప్రెషనొకటి పారేసిందట!  
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)