ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ దర్శకత్వంలో రవితేజ?

Mon, Jan 30, 2012
     బహు భాషా నటుడిగా వెండితెర పై నవరసాలను శాసించిన కమలహాసన్, త్వరలోనే తన విశ్వరూపాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న 'విశ్వరూపం' చిత్రం అనంతరం ఆయన నటుడిగా... దర్శకుడిగా 'అమర్ హై' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు-తమిళ- మలయాళ-హిందీ భాషలలోని కథానాయకుల తో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే తెలుగు నుంచి రవితేజా, తమిళ నుంచి అజిత్, మలయాళం నుంచి మోహన్ లాల్ ఎంపిక జరగగా హిందీ నుంచి ఎవరనేది తేలాల్సి ఉంది. సినిమాలో ఈ ప్రధాన పాత్రలన్నింటికి ప్రాతినిధ్యం వహిస్తూ కమలహాసన్ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.

    'దశావతారం' వంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన ఆస్కార్ రవి చద్రన్... భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రతిస్టాత్మకంగా రూపొందే ఈ సినిమాలో అభిమాన కథానాయకుల సరసన ఆడిపాడే అందగత్తెలు ఎవరనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవినీతి రాజకీయాలను దుయ్యబడుతూ... సాంకేతిక పరిజ్ఞాన్ని దుర్వినియోగం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న మోసాలకు ఈ సినిమా అద్దం పడుతుందని కమలహాసన్ చెప్పారు. సాధారణంగా కమల్ చిత్రాలు ఇటు వినోదాత్మకంగా, అటు ప్రయోగాత్మకంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవినీతిని కడిగేసేందుకు భారీ ఎత్తున ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృత మౌతుందనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)