ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అభిమాననటిపై అలక!

Mon, Jan 30, 2012
      తెలుగు సినిమాల్లో మసాల అనేది మాటలని దాటి, పాటలకి పాకి చాలాకాలం అయింది. అయితే అప్పట్లో ఈ టైపు పాటలు వ్యాంపుల వేదికపై నుంచి వచ్చేవి. రాన్రాను మరింత మసాలాను ఒంటికి పట్టించుకున్న ఈ పాటలు ఇప్పుడు హీరోయిన్ల అందచందాలపై నుంచి జాలువారుతున్నాయి. అసలు కథలో ఓ నాయిక ఉంటే... మరో హీరోయిన్ తో ఇలాంటి పాటలు పెట్టి, వాటికి ఐటంసాంగ్స్ అని పేరుపెట్టి కూడా చాలా కాలమైంది. దాంతో ఈ టైపు సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి ఆదరణ కూడా పెరిగింది. ఫలితంగా ఇలాంటి పాటల్లో కవ్విస్తూ కనువిందు చేసే అందగత్తెలకి డిమాండ్ ఎక్కువైపోయింది. బ్యానర్ ఏంటీ...హీరో-హీరోయిన్ ఎవరు...అనేది పట్టిచుకోకుండా ఐటంసాంగ్ ఎవరు చేస్తున్నారు అనే దాని పైనే ఆడియన్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దాంతో ఐటంసాంగ్స్ కోసం హీరోయిన్స్ మధ్య గట్టి పోటి ఉంటోంది.

    ఓ వైపున కరీనా ...మరో వైపున కత్రీనా ఐటంసాంగ్స్ తో హల్ చల్ చేస్తుంటే ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఆ బాటనే పట్టింది. 'ఫెరారీ కి సవారి' అనే చిత్రం లో ఆమె ఓ ఐటంసాంగ్ చేస్తోంది. రాజేష్ మస్సూకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే ఈ ఐటంలో సాహిత్య పరంగా, చిత్రీకరణ పరంగా, వేషధారణ పరంగా మసాలా అనేదే ఉండదని అంటున్నారు. ఇవేవి లేకపోతే అది ఐటంసాంగ్ ఎలా అవుతుందనే గుసగుసలు అప్పుడే మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యాబాలన్ అభిమానులు మాత్రం 'మేమంతా కలిసి నీకిచ్చిన ఇమేజ్ ఏంటి... నువ్వు చేస్తున్న డాన్స్ లేంటి' అంటూ అలుగుతున్నారట!   
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)