ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెండితెరపై జూనియర్ యస్వీఆర్

Mon, Jan 30, 2012
         యన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య మనవల కోవలో తెలుగు వెండితెరకు మరో మనవడు వారసుడుగా వచ్చాడు. మహానటుడు యస్వీ రంగారావు మనవడు జూనియర్ యస్వీఆర్ హీరోగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. అతను నటించే తొలి సినిమా షూటింగు ఈ రోజు హైదరాబాదు ఫిలిం నగర్లోని దైవ సన్నిదానం ప్రాంగణంలో ప్రారంభమైంది. యస్వీఆర్ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు 'యస్వీఆర్ సినీ కార్ప్' పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆ బ్యానర్ పై తొలి చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో జూనియర్ యస్వీఆర్ సరసన నీలం ఉపాద్యాయ్ కథానాయికగా నటిస్తోంది. యస్.ఆర్.చరణ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

       అరవై రోజుల పాటు జరిపే సింగిల్ షెడ్యుల్ లో షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాత ఎస్.వీ.ఎల్.ఎస్. రంగారావు చెప్పారు. ఈయన జూనియర్ రంగారావుకు సోదరుడు. ఈ సందర్భంగా నిర్మాత యస్.వీ.ఎల్.ఎస్.రంగారావు చెబుతూ, "మా తాత గారు ఉండగానే మా చిన తాత జగ్గారావు గారు సినిమాల్లో నటిస్తుండే వారు. మా నాన్నగారు కోటేశ్వరరావు గారు సినిమాలకు దూరంగా, వ్యాపారం చేస్తుండేవారు. మా చిన్నప్పుడే నాన్నగారు పోయారు. తర్వాత తాతగారు కూడా పోయాక ఇక ఎవరూ సినిమాలకు రాలేదు. తాతగారి జ్ఞాపకార్ధం సినిమా నిర్మాణం చేబట్టాలని మేం నిశ్చయించుకున్నాం. మా తమ్ముడు రంగారావుకి నటన అంటే ఇంట్రెస్ట్. అందుకే శిక్షణ ఇప్పించి హీరోగా పరిచయం చేస్తున్నాం" అన్నారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతుందన్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)