ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇప్పుడు టైం కలిసొచ్చిందట!

Mon, Jan 30, 2012
        సినిమా రంగంలో ఎప్పుడెవరికి టైమొస్తుందో చెప్పలేం. రాధ కూతురు కార్తీక కెరీర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. తొలి చిత్రం 'జోష్' అట్టర్ ఫ్లాపవడంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో తమిళంలో 'కో' సినిమాలో అవకాశం వచ్చింది. అది తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా (తెలుగులో రంగం) హిట్టవడంతో ఇప్పుడు బిజీ అయింది. తెలుగులో యన్టీఆర్ పక్కన 'దమ్ము' సినిమాలో నటించే చాన్స్ కొట్టింది. అలాగే తమిళంలో రెండు మూడు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.

      తాజాగా బాలీవుడ్ ఆఫర్ కూడా చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. 'కో' చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా కార్తీకనే హీరోయిన్ గా బుక్ చేసుకున్నారట. ఇలా తక్కువ కాలంలోనే ఇన్ని భాషల్లో నటించే అవకాశం వచ్చినందుకు ఈ చిన్నది తెగ ఆనందపడిపోతోంది. ఇక తల్లి రాధ అయితే చెప్పేక్కర్లేదు. తన పేరు నిలబెట్టేస్తుందని ధీమాగా చెప్పేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)