ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో రీమేక్ ఓకే చేసిన కండలవీరుడు

Sat, Jan 28, 2012
       ఈమధ్య కాలంలో సౌత్ రీమేక్ ల మీద ఎక్కువగా ఆధారపడిపోయిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తాజాగా మరో సౌత్ రీమేక్ చేయడానికి అంగీకరించాడు. మాధవన్, ఆర్య, సమీరా రెడ్డి, అమలా పాల్ ప్రధాన పాత్రధారులుగా ఇటీవల లింగుసామి రూపొందించిన 'వేట్టై' తమిళ చిత్రాన్ని సల్మాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా సల్మాన్ కి బాగా నచ్చిందనీ, పైగా అది హిట్ అవడంతో వెంటనే మొదలెట్టమని చెప్పాడనీ బాలీవుడ్ సమాచారం. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను సల్మాన్, ఆర్య చేసిన పాత్రను రణభీర్ కపూర్ చేస్తారట. 'వేట్టై' యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో సల్మాన్ దీనిని ఎంచుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే సల్మాన్ 'పోకిరీ', 'రెడీ', 'బాడీగార్డ్' చిత్రాలు రీమేక్ చేయగా, తెలుగు సినిమా 'కిక్' కూడా చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు 'వెట్టై' కూడా ఆ జాబితాలో చేరుతోంది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)