ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాడీగార్డ్' ని అధిగమిస్తున్న 'అగ్నిపధ్'?

Fri, Jan 27, 2012
       హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన 'అగ్నిపధ్' చిత్రం కలక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న రిపబ్లిక్ డే నాడు విడుదలైన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వసూళ్లు, ఆమధ్య సల్మాన్ నటించిన 'బాడీగార్డ్' చిత్రాన్ని అధిగమించాయి. 'బాడీగార్డ్' తొలి రోజు వసూళ్లు 21.5 కోట్లు కాగా, 'అగ్నిపధ్' వసూళ్లు 23 కోట్లతో రికార్డు క్రియేట్ చేశాయి. అలాగే, ఈ రోజు (శుక్రవారం) 15 నుంచి 18 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రోజుకి 20 కోట్ల చొప్పున ఉండచ్చని అంటున్నారు. ఎలా చూసినా ఈ వారం నాలుగు రోజుల్లోనూ 75 కోట్ల పైనే వసూళ్లు ఉంటాయని అంచనా కడుతున్నారు. 'బాడీగార్డ్' తొలి వారం ఐదు రోజుల వసూళ్లు 85. 5 కోట్లుగా రికార్డయ్యాయి. ఆ ప్రకారం చూస్తే, 'అగ్నిపధ్' కేవలం నాలుగు రోజుల్లోనే 'బాడీగార్డ్' వసూళ్లను కొట్టి అవతల పారేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)