ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిన్నటి కథానాయిక దీన గాథ!

Thu, Jan 26, 2012
        సినిమా రంగంలో తాగుడు అనేది పెద్ద విషయం కాదు. మందు కొట్టే హీరోయిన్లు కూడా చాలా మంది వున్నారు. అయితే, ఎవరి ఇంట్లో వాళ్లు తాగితే ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ, తాగి పబ్లిక్ గా తిరిగినప్పుడే వాళ్లు మీడియాకు ఎక్కుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా కూడా అలా మీడియాకు దొరికిపోయింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్ చౌదరి నెలకొల్పిన ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లి రాత్రంతా అక్కడ మందుకొట్టి, మర్నాడు ఉదయం తూలుతూ వెళ్తుంటే మీడియా కెమెరాలు ఆమెను బంధించాయి. మందు తీసుకునే అలవాటు ఆమెకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, భర్తతో ఈమధ్య ఆమెకు పొసగకపోవడం వల్ల ఆ డిప్రెషన్లో ఆ వ్యసనానికి మరింతగా బానిస అయిందనీ బాలీవుడ్ మీడియా కథనం. మరోపక్క, వయసుకు తగ్గా పాత్రలు పోషిస్తూ, నటిగా బిజీ అవాలని గత కొంత కాలంగా ఆమె ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు.          
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)