ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జైలుకెళ్ళిన పూరీ జగన్నాథ్!

Thu, Jan 26, 2012
      గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి జైలుకెళ్లారు. ఓ టీవీ చానల్ కి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఆయన తన కొడుకు, కూతురుతో కలిసి చర్లపల్లి జైలుకి వెళ్లారు. జైలు అధికారుల అనుమతితో ఖైదీలను కలుసుకున్నారు. వాళ్లందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆనందంగా గడిపారు. ఖైదీలంతా కూడా తమ సమస్యలన్నీ మరిచిపోయి పూరీ జగన్నాథ్ పట్ల ఎంతో అభిమానాన్నిచూపించారు.

     ఖైదీల జీవిత విశేషాలను తెలుసుకుంటూ, వాళ్లు అక్కడ చేస్తోన్న వివిధ రకాల పనులను దగ్గరుండి పరిశీలించారు. ఖైదీలతో కలివిడిగా ఉంటూ వాళ్లని పదే పదే ఉత్సాహపరిచారు. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోవడంతో చర్లపల్లి ఓ జైల్లా కాకుండా ఆశ్రమంలా అనిపిస్తోందని పూరీ అన్నారు.

    ఈ సందర్భంగా గతంలో తాను రెండు రోజులు జైలులో గడిపిన అనుభవాన్ని పూరీ గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో ఓ కేసు విషయంలో పోలీసులు తనని రెండు రోజులు జైల్లో పెట్టారని చెప్పారు. అప్పుడు చాలా బాధ కలిగిందని ఆయన చెప్పారు. బంగారపు కడ్డీలతో చేసినా జైలు జైలేనని, స్వేచ్చ లేకపోతే నరకమేననీ పూరీ అన్నారు.         
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)