ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అవినీతిపై కమల్ 'అమర్ హై'

Tue, Jan 24, 2012
      గతంలో అవినీతిపై 'భారతీయుడు' చిత్రంతో సమరం సాగించిన ప్రముఖ నటుడు కమల హాసన్, త్వరలో ఇదే అంశంపై మరో చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. దీని కోసం 'అమర్ హై' అనే టైటిల్ ని కూడా నిర్ణయించుకున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం చేస్తున్న 'విశ్వరూపం' చిత్రం పూర్తయ్యాక ఆ చిత్రాన్ని ప్రారంభిస్తానని కమల్ చెప్పాడు.

     "ప్రస్తుతం భారతీయ సమాజంలో, రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి కథా వస్తువుగా ఈ చిత్రం రూపొందుతుంది. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయిలో పలువురు చేస్తున్న మోసాలను కూడా ఇందులో చర్చిస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది" అంటున్నారు కమల్. కాగా, 'విశ్వరూపం' నెల రోజుల షెడ్యూలు ఇటీవలే న్యూయార్క్ లో చేసినట్టు ఆయన తెలియజేశాడు. ఇక క్లైమాక్స్ మాత్రం చిత్రీకరించాల్సి వుందని చెప్పారు.         

 
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)