ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముగ్గురు భామలతో రానా సయ్యాట!

Tue, Jan 24, 2012
    రానా దగ్గుబాటి కూడా ఐటెం సాంగ్స్ మీద మక్కువ చూపిస్తున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 'నా ఇష్టం' చిత్రంలో ఓ ఐటెం పాట చేస్తున్నాడు. ఇందులో ఆయనతో కలిసి ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు సయ్యాట ఆడతారు. వీరిలో హంసానందిని, మేరియం జఖారియా (డియ్యాలో డియ్యాలో ఫేం) ఇంతవరకు ఎంపికయ్యారు. మరో నటిగా కొత్త అమ్మాయిని ప్రయత్నిస్తున్నారు.

   ఈ పాట 2012 ని రాక్ చేసే విధంగా ఉంటుందనీ, అందరూ ఈ పాట గురించే మాట్లాడుకుంటారనీ, ఆ స్థాయిలో దీనిని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామనీ చిత్ర దర్శకుడు ప్రకాష్ తోలేటి చెబుతున్నాడు. త్వరలో ఈ పాటను చిత్రీకరిస్తామన్నారు. షూటింగుకు సంబంధించి ఈ పాట ఒక్కటే ఇక మిగిలి వుందని చెప్పారు. ఈ సినిమాలో రానా పూర్తిగా కొత్త లుక్ తో కనిపిస్తాడన్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటున్న జెనీలియా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)