ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కరీనాకపూర్ ని అనుకరించలేదు -ఇలియానా

Tue, Jan 24, 2012
       ఇక ఆమె పని అయిపోయిందనుకున్న తరుణంలో గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు మళ్లీ విజ్రుంభిస్తోంది. ఈ సన్ననడుము సుందరి తమిళంలో నటించిన 'నన్బన్' సినిమా ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతోంది. తెలుగులో 'స్నేహితుడు' గా అనువాదం అయిన ఈ చిత్రాన్ని ఈ నెల 26 న రిలీజ్ చేస్తున్నారు. హిందీలో 'త్రీ ఇడియట్స్' పేరుతో దేశాన్ని ఒక ఊపు ఊపిన ఈ సినిమా ఇప్పుడు తమిళ్ లో కూడా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఇల్లీ బ్యూటీ అంటోంది. ఈ నేపథ్యంలో చేసిన ఇంటర్వ్యులో తన కెరీర్ గురించి ఈ సుందరాంగి చెప్పిన సంగతులు....

       ఒక తమిళ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడం ఎలా ఉంది?

  తెలుగు, తమిళ్ అనేది పక్కన పెడితే, ఒక సూపర్ హిట్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్పీరియన్స్.

         'కిక్' తర్వాత  దాదాపు మీకు తెలుగులో హిట్స్ లేవు.. దాని పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు?

  ముందే చెప్పినట్టు కళాకారులకి భాషా బేధాలు ఉండవు. 'కిక్' తర్వాత మంచి సినిమాలనే ఎన్నుకున్నాను. కానీ, అవి అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ 'శక్తి', 'నేను నా రాక్షసి' నాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తమిళంలో 'నన్బన్' మంచి హిట్ అయింది. చాలా ఆనందంగా ఉంది.

             'శక్తి' సినిమా టైం లో ప్రమోషన్ కి మీరు కో- ఆపరేట్ చేయలేదని వార్తలొచ్చాయి...?

 అవన్నీ ఒట్టి పుకార్లు. నాకు, వారికి ఎటువంటి విభేదాలు లేవు. నాకు ఆ సినిమా చాలా సంతృప్తినిచ్చింది.  అయినా పాత విషయాలు ఇప్పుడు అనవసరం కదా (నవ్వుతూ)!

           'త్రీ ఇడియట్స్' లో కరీనా కపూర్ పోషించిన పాత్రని ఇప్పుడు మీరు చేయడం ఎలా అనిపించింది?

 కరీనా కపూర్ గొప్ప నటి. ఆమెతో నన్ను పోల్చుకోకపోయినా, ఆమెను మాత్రం అనుకరించలేదు. హిందీ సినిమా ఐదారు సార్లు చూసాను. నాకు చాలా బాగా నచ్చింది.

          మీ సహనటుల గురించి చెప్పండి?

   తమిళ్ లో సూపర్ స్టార్స్ ఐన విజయ్, శ్రీరాం, జీవా నటన అద్భుతమనే చెప్పుకోవాలి. హిందీ నటులకి ఏ మాత్రం తీసిపోలేదు. తమిళ్ లో మాదిరిగా ఇక్కడ కూడా వారికి మంచి పేరు వస్తుంది.

         దర్శకుడు శంకర్ గురించి?

 భారతదేశంలో అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ గారితో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా 'పట్టుదల' నేర్చుకున్నాను.

      బాలీవుడ్ లో మీరు చేస్తున్న సినిమా గురించి?

  అనురాగ్ బసు దర్శకత్వం లో 'బర్ఫీ' చేసాను. ఆ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరూ మెచ్చే సినిమా అవుతుంది. ఎందుకంటే అందులోని భావోద్వేగాలతో కూడుకున్న కొన్ని సన్నివేశాలు ఎవరినైనా కంట తడి పెట్టిస్తాయి.

         ప్రియాంకా చోప్రాతో మీకు పొరపొచ్చాలు వచ్చినట్లున్నాయి?

  అలాంటివి ఏమీ లేవు. ఆమె నాకు మంచి స్నేహితురాలు అయింది. ఆమెతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.

        
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)