ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ధనుష్ పాటలో అతిధిగా అనుష్క

Tue, Jan 24, 2012
    ఈమధ్య కాలంలో ఒకే ఒక్క పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ అల్లుడు, తమిళ చిత్ర కథానాయకుడు ధనుష్, తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. '3' సినిమా కోసం 'కొలవెరి డి' పాటను రాసి, పాడి సంచలనం సృష్టించిన ధనుష్, తాజాగా ఓ పాటకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ పాటను ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో రైల్వే స్టేషన్ లొకేషన్లో ఆయన చిత్రీకరిస్తున్నారు. విశేషమేమిటంటే, ఇందులో ఆయనతో బాటు అనుష్క కూడా నర్తిస్తోంది. ఈ పాటకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, ఈ పాట ఫిబ్రవరి 3 న విడుదల కానున్న '3' సినిమాలోనిదే అని తెలుస్తోంది!
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)