ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ పాత్రలపై మనసు పారేసుకున్న భామ

Sat, Jan 21, 2012
      అందమే ఆనందం ...ఆ అందమే కథానాయికలకి ఐశ్వర్యం అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కథానాయికలు అయిన తర్వాత పేరు తెచ్చే పాత్రలు పోషించాలనీ...ఆశించిన స్థానానికి చేరుకోవాలని ఆరాటపడతారు. అవి కాస్తా నేరవేరాక... నచ్చిన పాత్రలు కొన్ని మనసులో పెట్టుకుని, వాటిలో తమని తాము నిరూపించుకునే అవకాశం రావడంలేదనే అసహనానికి లోనౌతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఈ పరిస్థితుల్లోనే ఉంది. తెరపై సౌందర్య సంపదని ప్రదర్శిస్తూ హీరోల సరసన ఆడి పాడటం... కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడం ఆమెకి కాస్త బోరు కొట్టిందట! దాంతో 'విలనీ' పాత్రల కోసం విస్తృతం గా ట్రై చేస్తోంది.

      విలనీ తరహా పాత్రలు... పవర్ ఫుల్ గా ఉంటాయనీ, నటనలో వైవిధ్యానికి  అవకాశం కల్పిస్తాయని ఆమె అంటోంది. కథ మలుపు తిరగడానికి కారణమయ్యే అలాంటి పాత్ర చిన్నదైనా సరే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్తోంది. తన కోసం అలాంటి కేరక్టర్ ని డిజైన్ చేసి తీసుకొస్తే కొత్త దర్శకులతో చేయడానికి కూడా తాను వెనుకాడనని అంటోంది. ఆమె కోరిక తీరుతుందో లేదో అనే విషయం పక్కన పెడితే...పుర్రెకో బుద్ధి - జిహ్వకో రుచి అని ఎందుకంటారనేది మాత్రం అర్ధమైపోతుంది.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)