ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు సినిమాలో మరో తమిళ తార

Sat, Jan 21, 2012
       ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురైన వరలక్ష్మి తమిళంలో హీరోయిన్ గా రాణిస్తోంది. ఎమ్మెస్సీ చవిన వరలక్ష్మి నటనలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. గత కొంత కాలంగా ఈ అందాల భామ తెలుగు సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. మంచి అవకాశం ద్వారా టాలీవుడ్ ప్రవేశం చేయడం కోసం ఎదురుచూస్తోంది. ఆ అవకాశం ఆమెకు తాజాగా వచ్చిందని తెలుస్తోంది. నాగ చైతన్య పక్కన ఓ సినిమాలో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు రాధామోహన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించే 'గౌరవం' చిత్రంలో కథానాయికగా వరలక్ష్మిని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే చైతన్య, వర జంటపై చెన్నయ్ లో ఫొటో షూట్ కూడా చేశారట. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. 
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)