ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐశ్వర్య డైరక్షన్ లో అభిషేక్ మూవీ !

Fri, Jan 20, 2012
       ఈ మధ్యే ఓ బిడ్డకి జన్మనిచ్చిన ఐశ్వర్య  అప్పుడే దర్శకత్వంలోకి దిగడం ఏమిటీ..అందులో అభిషేక్ బచ్చన్ నటించడం ఏమిటి ... ?!  అనుకుంటున్నారు కదూ...అభిషేక్ బచ్చన్ నటించడం నిజమే గానీ... ఆ సినిమా తీస్తున్నది మాత్రం అతని భార్య ఐశ్వర్య కాదు...రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. ఇటీవల ఐశ్వర్య  దర్శకత్వం వహించిన 'త్రీ' సినిమాతోనూ, అందులోని కొలవారి పాటతోనూ ఆమెకి విపరీతమైన పాపులారిటి లభించింది. దాంతో ఆమెకి  బాలీవుడ్ నుంచి పిలుపూ వచ్చంది.

       ఉత్సాహంతో ఉన్నపళంగా వెళ్లిన ఆమె, అభిషేక్ బచ్చన్ ని కలిసి 3 భారీ కథలు వినిపించిందట! వాటిలో ఏదోవొకటి ఫైనలైజ్ కావడం ఖాయమని అంటున్నారు. కథ ఏదైనా కొలవరి పాట మాత్రం కంపల్సరీగా ఉండాలని అభిషేక్ బచ్చన్ సూచించినట్టు తెలుస్తోంది. ఒకే ఒక్క సినిమాతోనే ఆమెకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ రావడంతో కోలీవుడ్ లోని కొన్ని వర్గాలు కంగుతిన్నాయట. అరుదైన ఈ అవకాశం వర్కౌట్ అయితే ఆమె మరింత ముందుకి దూసుకుపోవడం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. ఎంతైనా రజనీకాంత్ కూతురు గదా ...ఆరంభం లోనే ఆమాత్రం టాలెంట్ ఉండటంలో ఆచ్చర్యంలేదు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)