ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'హీరోయిన్' డబ్బు ముచ్చట్లు

Thu, Jan 19, 2012
       బాలీవుడ్ ప్రేక్షకులకి దొరికిన బహు చక్కని సౌందర్యం...కరీనాకపూర్. ఆడుతూ...పాడుతూ నవరసాలను నడిపించడం ఆమె ప్రత్యేకత. గాసిప్ లను గాలికొదిలేసి కెరియర్ ని కంచుకోటలా నిర్మించుకున్న కరీనాకపూర్, ఇప్పుడు వందకోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. గత రెండేళ్లుగా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. 'త్రీ ఇడియట్స్'... 'రా.వన్'... 'బాడీగార్డ్' వంటి చిత్రాలు 300 కోట్లకి పైగా వసూలు చేశాయి. మరో వైపున ఈ సినిమాలు నటనాపరంగా కూడా ఆమెకి మంచి మార్కులు దక్కేలా చేశాయి.

     ఇక 'జబ్ వియ్ మెట్' సినిమాలో కరీనా నటనకి ప్రశంసలు -పురస్కారాలు లభించాయి. వయసుతో పాటు క్రేజ్ ని - ఇమేజ్ ని పెంచుకుంటున్న ఈ కలువరేకులాంటి కథానాయిక, తన సినిమాలు నిర్మాతలకి డబ్బు...తనకి పేరు తెచ్చేవిలా ఉంటాయని చెపుతోంది. అందువల్ల అలాంటి సినిమాలేవీ తాను వదులుకోనని తేల్చేసింది.  ప్రస్తుతం తను చేస్తున్న 'హీరోయిన్' సినిమా కూడా నిర్మాతలకి లాభసాటిగా...తనకి మంచి పేరు తెచ్చేదిలా ఉంటుందని అంటోంది. అందానికి అదృష్టం కలిసొస్తే... కలలన్నీ కాలమే తీరుస్తుంది... అంటే ఇదేనేమో!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)