ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భామల మధ్య భారీ పోటీ

Wed, Jan 18, 2012
     ప్రస్తుతం తెలుగు తెరపై నాజూకు అందాలను ఆరబెడుతూ... బిజీ బిజీగా సినిమాలు చేస్తూ... వీలైనంతవరకు విజయాలను మూటగట్టుకుపోతోన్న ముద్దుగుమ్మలు ముగ్గురే ముగ్గురు. వాళ్ళే ...సమంతా -తమన్నా -కాజల్. తెరపై సన్నజాజి పువ్వుల్లా సందడి చేస్తూ, కుర్రకారుని ఊరిస్తోన్న ఈ వయ్యారి భామలు ఒకరికి ఒకరు గట్టిపోటీగా నిలుస్తున్నారు. 'దూకుడు' సంచలనాత్మక విజయం సాధించడంతో  సమంతా మాంఛి  జోష్ మీద ఉంటే...100 % లవ్ , ఊసరవెల్లి వంటి చిత్రాలతో తమన్నా తన స్పీడ్ పెంచేస్తోంది. ఇక 'బిజినెస్ మేన్' కి వస్తోన్న రెస్పాన్స్ చూసి కాజల్ అగర్వాల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతోందట!

      అయితే వీళ్ళు సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకోవడం లేదు. ముగ్గురూ కూడా తమ సక్సెస్ గ్రాఫ్ ని పెంచుకునే పనిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  రాజమౌళి దర్శకత్వం లో 'ఈగ'..., రాంచరణ్ సరసన 'ఎవడు?'...'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ...మణిరత్నం దర్శకత్వం లో 'పూక్కడై'...ఇంకా గౌతం మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తూ సమంతా చాలా చాలా బిజీగా ఉంది. ఇక మురుగదాస్ దర్శకత్వంలో 'తుపాకీ' చేస్తోన్న కాజల్... ఎన్టీఆర్ కాంబినేషన్ లోనూ,  రాం చరణ్ కాంబినేషన్ లోనూ , సూర్య కాంబినేషన్ లో ఓ తమిళ సినిమాలోనూ వరసగా సినిమాలు చేయబోతోంది. రీసెంట్ గా ఓ హిందీ మూవీకి కూడా సైన్ చేసిందట!

      తానేమీ తక్కువ తినలేదంటూ తమన్నా కూడా రామ్ కాంబినేషన్ లో 'ఎందుకంటే...ప్రేమంట!', ప్రభాస్ కాంబినేషన్ లో 'రెబల్', రామ్ చరణ్ కాంబినేషన్ లో 'రచ్చ' చేస్తోంది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన కూడా నటించబోతోందట! ఇక ఇలియానా హవా తగ్గినట్లేనని అందరూ అనుకుంటున్న సమయంలోనే ఆమె నటించిన తమిళ చిత్రం 'నన్బన్' ఘన విజయాన్ని సాధించింది. ఇదే సినిమా ఇప్పుడు 'స్నేహితుడు'  పేరుతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ సినిమా హిట్ అయితే ఇలియానాకి మళ్లీ ఇక్కడ మంచిరోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. తెలుగులో అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ మూవీ చేస్తున్న ఇలియానా... బాలీవుడ్ లో 'బర్ఫీ', కిలాడీ 786 , 'వన్స్ అపానే టైం ఇన్ ముంబై -2' సినిమాలతో తీరిక లేకుండా ఉంది.

      వీళ్ళ స్పీడ్ చూస్తుంటే అటు హిందీనీ...ఇటు తెలుగు-తమిళ రంగాలను కలిపి దున్నేసేలా ఉన్నారు. మొత్తానికి అందం, అదృష్టం ఉన్నచోటే ముందు చూపు కూడా ఉంటుందనేది ఈ ముద్దుగుమ్మల్ని చూస్తే తెలియడం లేదూ!
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)