ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కాచెల్లెళ్ల మధ్య పోటీయా?

Wed, Jan 18, 2012
    తమ మధ్య మీడియా లేనిపోని వివాదాలు సృష్టించి, తమ పరువు బజారున పడేస్తోందని ఆ అక్కాచెల్లెళ్లు వాపోతున్నారు. రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య మధ్య వృత్తిపరమైన పోటీ నెలకొందనీ, అది శత్రుత్వంగా మారిందనీ ఇటీవల కోలీవుడ్ మీడియాలో బాగా గాసిప్స్ వచ్చాయి. ఆ శత్రుత్వం వల్ల తాము రూపొందిస్తున్న చిత్రాల హిందీ వెర్షన్స్ ను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ మీడియా రాసేసింది.

     అయితే, రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య వీటిని చాలా సీరియస్ పదజాలంతో ఖండించింది. "నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా '3' ఫీచర్ ఫిలిం. అది రేపు ఫిబ్రవరి 3 న హిందీలో కూడా తమిళ వెర్షన్ తో బాటే ఏకకాలంలో రిలీజవుతోంది. ఇక సౌందర్య డైరెక్ట్ చేస్తున్న సినిమా 'కొచ్చాడియాన్' ఎనిమేటేడ్ సినిమా. అదింకా అండర్ ప్రొడక్షన్లో వుంది. అసలు రెండూ ఒక్కసారి ఎలా రిలీజ్ చేస్తాం? కాస్త ఆలోచించి రాయాలి. ఈ వార్తలు మమ్మల్ని బాగా హర్ట్ చేశాయి" అంటోంది ఐశ్వర్య.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)