ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ కి తగిలిన 'మిరపకాయ్' ఘాటు

Wed, Jan 18, 2012
      తెలుగులో రవితేజ, దీక్షా సేథ్, రిచా గంగోపాధ్యాయ్ కాంబినేషన్ లో వచ్చిన 'మిరపకాయ్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలుసు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల  నిర్మించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో అక్షయ్ కుమార్ కి కథ వినిపించాడట దర్శకుడు హరీష్ శంకర్.

      అయితే ఈ సినిమాని తనతో చేయమని మరో హీరో అజయ్ దేవగణ్, హరీష్ ని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. 'సింగం' సినిమా సక్సెస్ తో మాంఛి ఊపు మీదున్న అజయ్ దేవగణ్ తోనే ఈ సినిమాని ప్లాన్ చేయడానికి హరీష్ శంకర్ కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అజయ్ దేవగణ్ కి అక్కడున్న మాస్ ఫాలోయింగ్ కూడా అందుకు ఓ  కారణమై ఉండొచ్చు. ఏదేమైనా, కథ - తీసే విధానం బావుంటే దాని ఘాటు ఏ ప్రాంతానికైనా తగలొచ్చు అనేది 'మిరపకాయ్' మరో మారు నిరూపించింది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)