ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఆది'లోనే లక్కీ చాన్స్ కొట్టిన కుర్రాడు!

Tue, Jan 17, 2012
    

       రజనీకాంత్ కొత్త చిత్రం 'కొచ్చాడియాన్'లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం జల్లెడ పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆది పినిశెట్టి కథానాయకుడుగా నటించిన 'అరవన్' చిత్రం వాళ్ల దృష్టికొచ్చింది. దాంతో ఆ సినిమా చూసి, 'ఆది' ని ఎంపిక చేసుకున్నారు. అన్నట్టు 'ఆది' ఎవరో కాదు... మన రవిరాజా పినిశెట్టి కుమారుడే! 'మిరుగం'... 'ఈరం'...వంటి తమిళ చిత్రాలతో 'ఆది' ఇప్పటికే అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ చిన్న కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించబోతోన్న ఈ సినిమాలో ఇప్పుడితను ఓ ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఇంకో  విశేషమేవిటంటే ...అందాల తార స్నేహ ఈ సినిమాలో  కథానాయకుడి చెల్లెలిగా నటించబోతోంది.

      ఈనెల 19 నుంచి చెన్నైలో షూటింగ్ జరుపుకోబోతోన్న ఈ సినిమాకి కె.ఎస్.రవికుమార్ కథని అందించడంతో బాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. తొలి రోజున రజనీకాంత్, స్నేహల కాంబినేషన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. రజనీకాంత్ ఇమేజ్ కి తగినట్టుగా... ఆయన అభిమానుల అంచనాలని అందుకునేదిలా సినిమా ఉంటుందని అంటున్నారు. ఎ.ఆర్. రెహ్మాన్ అందించబోతోన్న సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమని అంటున్నారు.

X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)