ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇద్దరు భామలతో ప్రభాస్ షూటింగ్

Mon, Jan 16, 2012
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిస్తోన్న 'వారధి' సినిమాలో ఓ కథానాయిక గా అనుష్క, మరో కథానాయికగా రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు. కథానాయికలు ప్రభాస్ హైట్ కి సరిపోయే వాళ్ళు కావడంతో తెరపై ఈ కాంబినేషన్ చూడ ముచ్చటగా ఉంటుందని అంటున్నారు. ఈ వయ్యారి భామలిద్దరు ప్రభాస్ తో కలిసి 'వారధి'పై పలికించబోతోన్నవలపు రాగాలను తిలకించేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ని కొత్త కోణంలో చూపించబోతున్నామనీ ... వైవిధ్యభరితంగా మలచిన ఆ కేరక్టర్ అతని ఇమేజ్ ని రెట్టింపు చేస్తుందని చెపుతున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అందరిని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లు పాల్గొనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)