ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫార్టీ ప్లస్ హీరోలతో జతకడుతున్న అమ్మాయి

Mon, Jan 16, 2012
ఆమెకి 20 ...అతనికి 40+ అంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రచారం ఎవరి గురించి అనే ప్రశ్నకి సమాధానం గా సోనాక్షి సిన్హా ని చూపిస్తున్నారు. 40 దాటిన హీరోలతో ఆమె జతకడుతుండటమే అందుకు కారణమని అంటున్నారు. తొలి చిత్రం 'దబాంగ్' లో ఆమె తన కంటే 25 ఏళ్ళు పెద్దవాడైన సల్మాన్ సరసన నటించింది. ఇప్పుడు కూడా 45 కి దగ్గరలో వున్న అక్షయ్ కుమార్ సరసన కనిపించబోతోంది. ఈ కారణంగానే ఆమె పై ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది. ఆనోటా ఈ నోట ఈవిషయం సోనాక్షి వరకు వెళ్ళింది. అయితే, దీనిని ఆమె లైట్ తీసుకుంటోంది. సీనియర్స్ తో నటించినపుడే నటనలో మెళకువలు తెలుసుకోగలమనీ... 'దబాంగ్' షూటింగ్ జరుగుతుండగా, సల్మాన్ ఇచ్చిన సలహాలు-సూచనలు ఆ తర్వాత తనకెంతగానో ఉపయోగపడ్డాయని ఆమె అంటోంది. వాళ్ళతో కలిసి నటించడం తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్తోంది. అయినా తనకి లేని బాధ వీళ్ళకెందుకంటూ తనని కామెంట్ చేస్తున్న వాళ్ళపై ఈ అమ్మడు పరోక్షంగానే' ఫైర్' అవుతోంది. పెద్ద హీరోలకి క్రేజు, ఇమేజు చెరో వైపున చేరి, వాళ్ళ వయసుకి గొడుగు పడుతుంటాయి. ఇక వాళ్ళ పక్కన నటించడానికి కుర్ర హీరోయిన్లు సైతం పోటీ పడుతుంటారు. కళ్ళప్పగించి కాంబినేషన్ ని చూడాలే గానీ, కామెంట్ చేస్తే...కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకనే అంటారు మరి!
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)