ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శృతి' మించి కోపానపడింది !

Sat, Jan 14, 2012
హీరో ధనుష్ తో తనకున్న స్నేహాన్ని కోలీవుడ్ మీడియా అపార్ధం చేసుకుందంటూ శృతి హాసన్ రుసరుస లాడుతోంది. గ్లామర్ ఫీల్డ్ లో గాసిప్స్ సహజమనీ, వాటిని లైట్ గా తీసుకోవాలని తన తండ్రి చెప్పాడని, అయితే అవి ఇంతగా మనసు కష్ట పెడతాయని అనుకోలేదని వాపోతోంది. 'త్రీ' సినిమాలో ధనుష్ సరసన కథానాయిక గా తాను నటించడం, ఆ చిత్రంలోని 'కొలవరి' సాంగ్ హిట్ కావడంతో కోలీవుడ్ మీడియా తమ పై రకరకాల కథనాలు ప్రచారం చేస్తోందంటూ ఆమె అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తాను ఎవరి ప్రేమలోనూ పడలేదనీ, ఒకవేళ ప్రేమిస్తే ఆ సంగతి అందరికీ ధైర్యంగా చెప్తానని అంటోంది. శృతి మించిన గాసిప్స్ తో ఆర్టిస్టులను హర్ట్ చేయకుండా కోలీవుడ్ మీడియా మసలుకోవాలని ఆమె కాస్త స్ట్రాంగ్ గానే క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి, కోలీవుడ్ మీడియా వింటుందా? లేక, డోస్ పెంచుతుందా?
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)