ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మీనా ప్రధానపాత్రలో 'శ్రీవాసవీ వైభవం'

Sat, Jan 14, 2012
కొంత కాలం గ్యాప్ తర్వాత ప్రముఖ నటి మీనా మళ్లీ వెండితెరకు వేంచేస్తోంది. ఒక భక్తిరస ప్రధాన చిత్రంలో మీనా ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించింది. గతంలో 'అన్నమయ్య', 'వెంగమాంబ' వంటి చిత్రాలను నిర్మించిన వి.ఎం.సి.ప్రొడక్షన్స్ అధినేత దొరస్వామిరాజు నిర్మించే 'శ్రీ వాసవి వైభవం' సినిమాలో మీనా టైటిల్ పాత్ర పోషిస్తుంది. ఉదయభాస్కర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రం షూటింగు ఈ నెల 19 న హైదరాబాదు రామకృష్ణా సినీ స్టూడియోస్ లో ప్రారంభం అవుతుందని నిర్మాత దొరస్వామిరాజు తెలిపారు. రామోజీ ఫిలిం స్టూడియోలో కూడా షూటింగు జరుగుతుందనీ, సింగిల్ షెడ్యూలులో షూటింగు పూర్తి చేస్తామనీ ఆయన చెప్పారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. చిత్రం ఎగ్జిక్యుటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెబుతూ, "వైశ్యులకే కాకుండా భారతదేశంలోని ఎంతో మందికి వాసవీదేవి దేవత. వాసవీ అమ్మవారికి సంబంధించిన అసలైన కథతో దీనిని రూపొందిస్తామనీ, మరో అన్నమయ్యలా ఈ చిత్రాన్ని నిర్మించడానికి దొరస్వామిరాజు ప్లాన్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ఇంకా ప్రియా హాసన్, సుహాసిని, సుమన్, సాయికిరణ్, నాగబాబు, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)