ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కంగనాపై కడుపు మంట!

Fri, Jan 13, 2012
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులకి అక్కడ కాసుల వర్షం కురుస్తుంది. ఒక్క అవకాశం అక్కడ వారి జీవితాన్నే మార్చేస్తుంటుంది.అందుకే కాస్త పేరున్న కథానాయికలు సైతం తమ దైన స్టైల్లో అవకాశాలను వెదికిపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒకరికి రావలసిన అవకాశాలు మరొకరికి పోతుంటాయి కూడా! దాంతో ఇక్కడ ఆవేశాలూ, అసూయలు మామూలే! ముఖ్యంగా బాలీవుడ్ లో ఉదయం నిద్రలేచింది మొదలు గాసిప్ లనే సిప్ చేస్తుంటారు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ గాసిప్ లని భుజాన వేసుకు తిరుగుతుంటారు. రీసెంట్ గా నేహా ధూపియ కూడా ఇదే పని చేసింది. మొన్నీమధ్య ఓ ఈవెంట్ నిమిత్తం సల్మాన్ ఖాన్, కంగనా రౌనత్ , నేహాధూపియ హైదరాబాద్ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగిన దగ్గరనుంచి సల్మాన్ ఖాన్, కంగనా రౌనత్ ల గురించి పక్కనున్న వాళ్ళతో లేనిపోనివి చెప్పేసిందట నేహా ధూపియ. హోటల్లో సల్మాన్, కంగనా మరీ అంత క్లోజ్ గా ఉండటం తనకి నచ్చలేదనీ, వాళ్ళ చిలిపి పనులు తాను చూడలేకపోయానని చెప్తూనే, సినిమా చుపించేసిందట. అయితే సల్మాన్, కంగనా ఫ్రెండ్షిప్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం...అటు మోడలింగ్ లోనూ, ఇటు సినిమాల్లోనూ తనను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే అసూయతోనే నేహా అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)