ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బిల్లా-2'లో చాన్స్ కొట్టిన అమలాపాల్

Fri, Jan 13, 2012
అజిత్ హీరోగా గతంలో తమిళంలో వచ్చిన 'బిల్లా' అక్కడ విజయాన్ని సాధించింది. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'బిల్లా-2 ' రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన అమలాపాల్ కథానాయికగా నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అనువాద చిత్రం 'నాన్న'లోనూ, 'బెజవాడ' చిత్రంలోనూ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. అయితే ఈ సినిమాలేవీ అంతగా ఆడక పోవడంతో, అమలాపాల్ ఆచూకీ లేకుండా పోయింది . విషయమేమిటంటే, ఈ అమ్మడు తిరిగి తమిళ సినిమాల్లోనే కంటిన్యు అవుతోంది. ఇదిలా ఉంచితే, ఈ సినిమాకి కూడా విష్ణువర్ధనే దర్శకుడు. చిత్రమేవిటంటే, పవన్ కళ్యాన్ హీరో గా రీసెంట్ గా విష్ణువర్ధన్ ఇక్కడ డైరెక్ట్ చేసిన 'పంజా' సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాంతో ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెన్నై చెక్కేసి 'బిల్లా-2'కి ప్లాన్ చేసి ఉంటాడనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. పొతే, హీరో అజిత్ మాత్రం మరో కొత్త సినిమా కథాచర్చల్లో బిజీగా ఉన్నాడనీ, ఆ సినిమాలో అతని సరసన అనుష్క నటించబోతోందని తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)