ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'యముడు' సీక్వెల్ కి సన్నాహాలు

Fri, Jan 13, 2012
'సింగం' (తెలుగులో యముడు) సినిమాతో ఆమధ్య సందడి చేసిన సూర్య, అనుష్క జోడీ మళ్లీ ఈ సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. 'సింగం' దర్శకుడు హరి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు. ఈ సినిమా నిర్మాణాన్ని విరమించుకున్నారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల్ని దర్శకుడు ఖండించాడు. ఆ వార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదనీ, తాను మాత్రం 'సింగం-2' చిత్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాననీ చెప్పాడు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ప్రాధాన్యత గల పాత్ర అనీ, ఆ క్యారెక్టర్ కి ఇంకా ఎవరూ ఖరారు కాలేదనీ తెలిపాడు. అయితే, పాప్యులర్ హీరోయిన్ నే తీసుకోవడం జరుగుతుందని చెప్పాడు. మార్చిలో తొలి షెడ్యులు షూటింగు ప్రారంభమవుతుందని అన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు. గతంలో 'సింగం' చిత్రాన్ని'యముడు' పేరుతో తెలుగులోకి డబ్ చేయగా, హిందీలో అజయ్ దేవగన్, కాజల్ లతో రీమేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)