ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇంతకీ... ఆ ముద్దుగుమ్మ ఎవరు?

Thu, Jan 12, 2012
      రజనీకాంత్ త్వరలో ఓ సినిమాలో నటిస్తున్నాడనగానే కథానాయికలు ఎవరికీ వాళ్లు తమ తమ మార్గాలలో ప్రయత్నాలు మొదలెట్టారు. ఆయన పక్కన నటించే లక్కీ చాన్స్ కోసం అర్రులు చాస్తూ ఎదురుచూస్తున్నారు. రజనీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించే 'కొచ్చాడియన్' సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఇద్దరి పేర్లు మాత్రం ఫైనల్ లిస్టులో చోటుచేసుకున్నాయి. వాళ్లల్లో ఒకరు అసిన్, మరొకరు విద్యాబాలన్! ఇద్దరూ ఎవరికి వాళ్లు తామే రజనీ కథానాయిక అన్నంత ధీమాగా వున్నారు. ఇటీవల విద్యాని రజనీకాంత్ పొగడడంతో 'తనే అతని కథానాయిక' అని ఆమె ఫీలవుతోంది. అలాగే, అసిన్ ని కూడా వాళ్లు కాంటాక్ట్ చేయడంతో, 'తనే రజనీ హీరోయిన్' అని ఆమె ఆశలు పెట్టుకుంది. అయితే, దర్శకురాలు సౌందర్య మాత్రం ఇంతవరకు ఎవరి పేరూ చెప్పకపోవడంతో సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది! 
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)