ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దక్షిణాది సినిమాలో కత్రినా కైఫ్?

Tue, Jan 10, 2012
     అటు కథానాయికగా, ఇటు ఐటెం గాళ్ గా ప్రస్తుతం బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తున్న సెక్సీతార కత్రినా కైఫ్ తొలిసారిగా ఓ సౌత్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనుంది. రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించే 'కొచ్చాడియన్' చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేయడానికి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రం ఎనిమేషన్ ప్రధానంగా రూపొందనుందని అంటున్నారు. అందులో ఓ చోట రజనీకి చెందిన ఏనిమేషన్ ఫిగర్ తో ఓ ఐటెం సాంగ్ వుందట. అందుకోసం కత్రినా కైఫ్ ను ఎంపిక చేసినట్టు, చేయడానికి ఆమె కూడా ఆనందంగా ఒప్పుకున్నట్టూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం షూటింగు వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కె.యస్. రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందుతుంది.  
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)