ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ సినిమాలు హిట్టవ్వకూడదా?

Mon, Jan 09, 2012
      ఆఫర్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుని, సొమ్ము చేసేసుకుందామని చూసిన చెన్నయ్ అందం సమంతాకు ఈమధ్య నిర్మాతల మండలి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ముందు ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ సద్దుబాటు చేసి, ఆ తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకో... అంటూ క్లాస్ పీకడంతో ఆమె కాస్త దూకుడు తగ్గించింది. అందుకే ఇప్పుడు సమంతా తెగ బాధపడిపోతోంది. ప్రస్తుతం తెలుగులో అరడజను సినిమాలు ఒప్పుకున్న ఈ బుల్లెమ్మ, డేట్స్ లేక తాజాగా పెద్ద పెద్ద సినిమాలు కూడా కొన్నిటిని తిరస్కరించాల్సి వచ్చిందట. వాటిలో తమిళ సినిమాలు కూడా కొన్ని వున్నాయట. "వదులుకున్న సినిమాలను చూస్తే చాలా బాధేస్తోంది. నేను వదిలేస్తే మరొకరు చేస్తారు కదా... అలా నేను చేయాల్సిన సినిమా రేపు ఒకవేళ పెద్ద హిట్ అయిపోతే నేనెంతో బాధపడాల్సి వస్తుంది. ఈమధ్య తమిళంలో చాలా పెద్ద సినిమాలు వదులుకున్నాను. అందుకే టెన్షన్ గా వుంది" అంటోంది సమంతా. అవ్వా కావాలి... బువ్వా కావాలంటే ఎలా తల్లీ?
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)