ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'3 am friend' అంటే ఏమిటంటున్న చరణ్!

Sat, Jan 07, 2012
        హీరో రామ్ చరణ్ కి ఇప్పుడొక ఇంగ్లిష్ పదానికి అర్ధం కావాల్సివచ్చింది. '3am friend అంటే సరైన అర్ధం ఎవరైనా చెబుతారా?' అంటూ ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రముఖులతో బాటు చాలా మంది ఆ పదానికి అర్ధాన్ని వివరిస్తూ పోస్ట్ చేస్తున్నారు. అయితే, అసలు చరణ్ కి ఈ పదం గురించి ఇప్పుడెందుకు అంత ఆరా? అని ఆరా తీస్తే, ఇటీవల కథానాయిక త్రిష ఓ ఆంగ్ల దినపత్రికలో రానా దగ్గుబాటి గురించి చెబుతూ 'రానా నాకు 3 am friend' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఆమధ్య రానా WOW పత్రిక ఇంటర్వ్యులో 'చరణ్ నాకు 3 am friend' అన్నాడు. దాంతో ఈ పదానికి అసలుసిసలు అర్ధం తెలుసుకోవాలన్న కుతూహలం చరణ్ కి కలిగి ఉంటుందని అంటున్నారు.

      'అన్ని వేళలా, అన్ని సందర్భాలలోనూ అందుబాటులో వుండే స్నేహితుడు' అన్న విస్తృతమైన అర్ధంలో ఇటీవలి కాలంలో హై సొసైటీ యూత్ ఈ '3 am friend' అనే పదబంధాన్ని వాడుతున్నారు. ఏమైనా, తనకు తెలియని ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వుండడం, అందుకు ఏమాత్రం సంశయించకుండా నలుగుర్నీ అడగడం అన్నది వివేకవంతుని లక్షణం. అది రామ్ చరణ్ కి బహుశా తండ్రి నుంచే వచ్చి వుంటుంది. ఎందుకంటే, చిరంజీవి కూడా తనకు తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటూ వుంటారు!   
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)