ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మత్తు పాటల మాత్ర.... సుచిత్ర!

Thu, Jan 05, 2012
       ఆమె స్వరం ఓ మత్తు మాత్ర ...ఆ స్వరంలో నుంచి ఉత్సాహం గా దూకే ప్రతి పాటా ఓ మందు పాత్ర .తెలుగు పాటకి హస్కీదనాన్నీ , సెక్సీదనాన్నీ కలిపి అందించే ఆమత్తు కోకిల పేరే సుచిత్రా కార్తీక్ కుమార్ . కొంటెదనాన్నీ... కొత్తదనాన్నీ తన స్వరంలో మేళవించి విచిత్రాలు చేయడం ...విస్మయుల్ని చేయడం సుచిత్ర ప్రత్యేకత అని చెప్పొచ్చు . రీసెంట్ గా 'సార్ ఒస్తారొస్తారా ... '(బిజినెస్ మేన్) అంటూ మాస్ ను మెస్మరైజ్ చేస్తున్న సాంగ్, ఆమె మంచి 'పాటకారి' అనే విషయాన్ని మరోమారు నిరూపించింది .  1979 ఏప్రిల్ 14  న  కేరళ లోని కొచ్చిలో జన్మించిన సుచిత్ర , కోయంబత్తూరులో MBA పూర్తి చేసింది .కాలేజ్ రోజుల నుంచే తన ప్రతిభను చాటుతూ వచ్చిన సుచిత్ర , ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కాలమిస్ట్ గా, రేడియో జాకీ గా, టీవీ యాంకర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయనిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

     చిత్ర పరిశ్రమలో గాయనిగా తన ప్రతిభాపాటవాల్ని నిరుపించుకోవాలన్న సుచిత్ర కలని, 2003 నిజం చేసింది. హేరిస్ జై రాజ్ సంగీత దర్శకత్వం వహించిన 'కాక కాక' తమిళ చిత్రం ద్వారా గాయనిగా సుచిత్ర ప్రస్థానం ప్రారంభమైంది .

పాటని కసిగా... కైపుగా పలికే ఆమె స్వరం తమిళ ప్రేక్షకుల్ని ఊరించిది! ఉత్సాహంతో స్టెప్పులు వేయించింది !! అలా ఆమె తమిళ ప్రేక్షకుల్ని ఉర్రుతలూగిస్తూనే... 2004 లో 'రణం' చిత్రంలోని 'చెలీ జాబిలీ' అనే పాట ద్వారా తెలుగు శ్రోతలకు పరిచయమైంది. 2006 లో 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ ఆంధ్రదేశమంతటా ఆమె చేసిన సందడి ...సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఓ రకంగా ఈ పాట...కుర్ర 'కారు' కి బ్రేకులు తీసేసింది ...పడుచు మనసులు పగ్గాలు విదిలించుకునేలా చేసింది .

    ఆ తర్వాత 'హ్యాపీ' చిత్రంలో 'ఓ సారే ...' అంటూ , 'చిరుత'లో ' యమహో ...' అంటూ తెలుగు ప్రేక్షకులకు కిక్కిచ్చిన సుచిత్ర ,''ఎక్స్సూజ్ మీ ... మిస్టర్ మల్లన్న...' అంటూ వాడ వాడలా వేడి పుట్టించింది. 'అదుర్స్' చిత్రంలో '' పిల్లా నా వల్ల కాదు ..', 'బృందావనం'లో 'నిజమేనా ...', 'శక్తి' చిత్రంలో 'సుర్రో సుర్రు...' అనే పాటలు ఆడియన్స్ కి కునుకు-కుదురు లేకుండా చేసాయి - ఆమె స్వర సామర్ధ్యానికి సాక్ష్యంగా నిలిచాయి. 'దడ' చిత్రంలో 'ఏ పిల్లా ...', 'కందిరీగ'లో 'చంపకమాలా ...', 'ఊసరవెల్లి'లో 'దాన్డియా...' వంటి పాటలు ఆడియన్స్ ని  జోరుగా ...హుషారుగా షికారు చేయించాయి - ఆమె గొంతులోని ప్రత్యేకతకు నిదర్శనంగా నిలిచాయి .

    ఇప్పుడు ప్రతి చోటా ..ప్రతి నోటా సుచిత్ర మాటే వినిపిస్తుంది ! సుచిత్ర పాటే పలకరిస్తుంది!! మణిశర్మ ..దేవిశ్రీ ప్రసాద్ ..హేరిస్ జై రాజ్ ..యవన్ శంకర్ రాజా ..తమన్ వంటి సంగీత  దర్శకులతో పనిచేసిన సుచిత్ర , ఇటు రికార్డింగ్ ధియేటర్స్ లోనే కాదు, అటు దేశ విదేశాల్లో స్టేజ్ షోస్ లోనూ ఆమె తన మసాలా వాయిస్ తో మంత్రం వేస్తూనే వుంది !మనసు మనసుకీ మత్తెక్కిస్తూనే వుంది !!                               
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)