ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ కి ఆ డ్రెస్సే కావాలట!

Wed, Jan 04, 2012
       కథానాయిక కాజల్ అగర్వాల్ కి సెంటిమెంట్లు ఎక్కువైపోయాయట. ముఖ్యంగా డ్రెస్ సెంటిమెంట్ మరీ ఎక్కువైంది. ప్రతి సినిమాలోనూ ఇంట్రడక్షన్ సీన్ లో తను వైట్ డ్రెస్ వేసుకుంటానని చెబుతోందట. మామూలుగా అయితే ఆయా దర్శకులు ఒప్పుకోకపోదురేమో కానీ, కాజల్ వాళ్లని సెంటిమెంటుతో కొడుతుండడంతో కాదనలేకపోతున్నారట. 'మగధీర', 'సింగం' సినిమాలు అంత హిట్ అయ్యాయంటే కారణం ఏమిటనుకుంటున్నారు.... ఆ సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్స్ లో నేను తెలుపు దుస్తులు ధరించడమే... అంటూ మెలికపెడుతోందట. దాంతో దర్శకులు ఏమీ మాట్లాడలేక 'సర్లే తల్లీ... మాకూ మంచిదేగా, అది వర్కౌట్ అయితే!' అంటూ తలలూపుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కూడా ఈ సెంటిమెంటుకి సరే అనక తప్పలేదు. విజయ్, కాజల్ జంటగా ఈయన రూపొందిస్తున్న 'తుపాకి' సినిమా విషయంలో అదే జరిగింది. ఆమె కోరికను, నమ్మకాన్ని కాదనలేక ఆమె ఇంట్రడక్షన్ దృశ్యాలను వైట్ డ్రెస్ లోనే తీశాడట!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)