ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినాని చూసి ఎవరైనా మారతారా?

Tue, Jan 03, 2012
      సినిమా రంగంలో ఒకళ్లని వాడుకోవడమే కానీ, ఒకళ్లకి హెల్ప్ చేయడం అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. పైగా, తమ దగ్గర పనిచేసే వాళ్ల పట్ల కృతజ్ఞత చూపడం మరీ తక్కువ. అయితే, బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, 'ఇలాంటి వాళ్లకు నేను భిన్నం' అన్న విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది. తన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న మేకప్ మేన్ సుభాష్ సింగ్ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించి, డేట్స్ కూడా ఇచ్చేసింది. అసలు ఆమె డేట్స్ ఇవ్వడమే మహాప్రసాదం అనుకున్న సుభాష్ కి ఆమె చూపిన ఔదార్యం కంటనీరు తెప్పించింది. పారితోషికంగా 'ఒక్క పైసా కూడా తీసుకోను' అని చెప్పిందట! దాంతో అతని ఆనందానికి ఇప్పుడు అంతు లేదు. ఓ హాలీవుడ్ రొమాంటిక్ సినిమా ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కానీ, జాన్ అబ్రహాం కానీ హీరోగా నటించే అవకాశం వుంది. దీనికి అజీజ్ మీర్జా దర్శకత్వం వహిస్తున్నాడు. మరి, కత్రినా బాటలో మన తారలు కూడా ఎవరైనా పయనిస్తారేమో చూద్దాం!
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)