ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సార్ ఒస్తారొస్తారా' పట్టుకుంది

Mon, Jan 02, 2012
      సార్... ఒస్తారొస్తారా.... ఈవేళ ఎక్కడ విన్నా ఇదే పాట. తెలుగు వాళ్లని ఈ పాట ఊపేస్తోంది. రేడియోల్లో, టీవీల్లో, రింగ్ టోన్లలో ఎక్కడ విన్నా ఇదే! ఆ పాటలో వున్న సెక్సీతనానికీ, మత్తుకీ కుర్రాళ్లు జోగేస్తున్నారు. అంతలా ఈ పాట ఇప్పుడందర్నీ పట్టి లాగేస్తోంది. మహేష్ బాబు, కాజల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్ మెన్' సినిమాలోనిదీ పాట. ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ కట్టిన బాణీ కన్నా గాయని సుచిత్ర పాడిన స్టయిలే, పాటకు అంతటి క్రేజ్ తెచ్చిందని చెప్పాలి. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాట రాసినప్పటికీ, 'సార్ ఒస్తారొస్తారా...' అన్న మాటలు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఇచ్చాడని అంటున్నారు. ఎందుకంటే, ప్రతి పాటకీ సంగీత దర్శకుడు 'తననాల'తో కూడిన ట్యూన్ ఇచ్చేటప్పుడు.. ఒక్కోసారి డమ్మీ మాటలు కూడా వేస్తుంటాడు. దీనినే సినిమా భాషలో అబద్దపు సాహిత్యం అని కూడా అంటుంటారు. ముఖ్యంగా కీరవాణి, కోటి ఇలాంటి డమ్మీ పదాలతో ట్యూన్ ఇస్తుంటారు.      

  
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)