ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమిర్ ఖాన్ సినిమాకి చిన్నికృష్ణ కథ

Mon, Jan 02, 2012
        బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సినిమాకి ఓ తెలుగు రచయిత కథ సమకూరుస్తున్నాడు. నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్ వంటి చిత్రాలకు కథలందించిన ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఆ అవకాశాన్ని పొందాడు. ఆమిర్ ఖాన్ ని దృష్టిలో పెట్టుకుని ఈయన రూపొందించిన కథ ఆమిర్ కి బాగా నచ్చిందట. ఆ సబ్జెక్ట్ తప్పకుండా చేస్తాననీ, ఇంకా బెటర్ మెంట్స్ చేయమనీ చెప్పాడట. ఈ విషయం గురించి చిన్నికృష్ణ చెబుతూ, "కథ ఒకే అయింది. ఆమిర్ కి నేను చెప్పిన లైన్ బాగా నచ్చింది. ప్రస్తుతం కథకి మెరుగులు దిద్దుతున్నాను. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వివరాలు ఆయనే చెబుతారు" అన్నాడు. చిన్నికృష్ణ రాసిన 'జీనియస్' కథ ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో సినిమాగా రూపొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడి తనయుడు ఈ చిత్రంలో కథానాయకుడనీ, అతని చుట్టూ కథ తిరుగుతుందనీ చిన్నికృష్ణ చెబుతున్నాడు
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)