ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ హీరోగా మరో సీక్వెల్!

Mon, Jan 02, 2012
        టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ మంచి ఊపందుకుంటోంది. విజయవంతమైన సినిమాలకు కొనసాగింపు చిత్రాలు తీసే పధ్ధతి జోరందుకుంటోంది. కొన్నేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇడియట్' సినిమాకి సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇంకో సినిమాకి సీక్వెల్ తీయడానికి సిద్ధపడుతున్నాడు. విశేషమేమిటంటే, ఈ రెండు సినిమాలూ రవితేజవే కావడం! రవితేజ హీరోగా దీక్షా సేథ్, రిచా గంగోపాద్యాయ హీరోయిన్లుగా గత సంవత్సరం వచ్చిన 'మిరపకాయ్' సినిమాకి సీక్వెల్ నిర్మించే ప్లాన్ జరుగుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడనీ, రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ చేస్తున్న 'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత ఇది సెట్స్ కి వెళ్ళచ్చు!
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)